మాస్‌క్లీనింగ్ డ్రైవ్‌ను విధిగా చేపట్టాలి
పల్నాడు డీపీఓ విజయభాస్కరరావు
యడ్లపాడు: ప్రతినెలా మూడో శనివారం ప్రతి గ్రామంలోనూ మాస్ క్లీనింగ్ డ్రైవ్‌ను విధిగా నిర్విహించాలని పల్నాడు జిల్లా పంచాయతీ అధికారి విజయభాస్కరరెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన యడ్లపాడు గ్రామాన్ని సందర్శించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీపీఓ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర –స్వచ్ఛదివస్ కార్యక్రమంలో భాగంగా గతంలో రీసర్వే పనులు పూర్తయిన గ్రామాల్లో స్వమిత్వ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వంకాయలపాడు పంచాయతీలోని ఉప్పరపాలెంలో కొత్తగా స్వమిత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రతినెలా మూడో శనివారం గ్రామాల్లో ప్రత్యేక పారిశద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రాల ద్వారా ప్రతినెలా ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. సోమవారం నుంచి ఇంటి పన్నుల వసూలు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. మార్చినాటికి నూరుశాతం పన్నులు వసూలు చేయాలని చెప్పారు. ఈ–ఆఫీస్ విధానాన్ని అమలు చేసి కాగిత రహిత సేవలు అందించాలని పేర్కొ న్నారు. సమీక్షలో డీఎల్‌పీవో లక్ష్మణరావు, ఎంపీడీఓ హేమలతాదేవి, ఈవోపీఆర్డీ షేక్ జాకీర్‌హుస్సేన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి
రేపల్లెరూరల్: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో పీఎం ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులకు వివిధ కంపెనీలు, పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు బాపట్ల జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పి.ప్రణయ్ శుక్రవారం పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 8555901198 నంబరులో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment