లైమ్ సిటీ పిడుగురాళ్లను పొగ మంచు ముంచెత్తుతోంది. ఉదయం పది గంటలైనా సూర్యుడు మంచుతెరలను చీల్చుకుని బయటకు రాలేకపోతున్నాడు. దీంతో వాహనదారులు ఆపసోపాలు పడుతున్నారు. దారి కనిపించక అవస్థలు పడుతున్నారు. లైట్ల వెలుతురులో నిదానంగా ప్రయాణిస్తున్నారు. మంచు దెబ్బను తట్టుకోలేక కొందరు ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు, పాదచారులు మంకీ క్యాప్‌లు వాడుతున్నారు. కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకూ జంకుతున్నారు. శుక్రవారం ఉదయం పిడుగురాళ్ల మాచవరం రోడ్డులో దర్శనమిచ్చిన చిత్రాలివీ..
– పిడుగురాళ్ల:
Comments
Please login to add a commentAdd a comment