వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షురాలిగా మాధవ
సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షురాలిగా సీనియర్ న్యాయవాది, మాజీ ఏపీపీ రోళ్ల మాధవి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఈ నెల 13న ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉంటూ న్యాయ సేవలు అందిస్తానని తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆమెను వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు దుశ్శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు మామిడి రాము, గణపవరం మాజీ సర్పంచ్ మర్రి సుబ్బారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
బీసీ సెల్ అధ్యక్షుడిగా గాంధీ
గురజాల రూరల్: పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా సిద్ధాడపు గాంధీని నియమిస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. గాంధీ ప్రారంభం నుంచి పార్టీ పట్టిష్టతకు కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ బాబు
కారెంపూడి: వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కారెంపూడికి చెందిన కొమ్ము చంద్రశేఖర్‌బాబు నియమితులయ్యారు. ఆయన కారెంపూడి ఎంపీటీసీ సభ్యుడిగా, పార్టీ జిల్లా కార్యదర్శిగా సేవలందించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ బాబు మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.
వలంటీర్స్ జిల్లా అధ్యక్షుడిగా మోర్తల ఉమ
రెంటచింతల: పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ వలంటీర్స్ విభాగం అధ్యక్షుడిగా మోర్తల ఉమామహేశ్వరరెడ్డి నియమితులయ్యారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా వలంటీర్స్ విభాగం అధ్యక్షుడిగా నియమించడానికి కృషి చేసిన పార్టీ జిల్లా అధ్యక్షులు, మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, పార్టీ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment