జగ్జీత్‌సింగ్ ప్రాణాలకు కేంద్రమే బాధ్యత వహించాలి
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు
నరసరావుపేట ఈస్ట్: రైతులు పండించిన పంటకు మద్దతు ధర చట్టం కోసం గత 50 రోజులుగా ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న జగ్జీత్‌సింగ్ దలేవాల్ ప్రాణాలకు ముప్పు ఏర్పడితే కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. జగ్జీత్‌సింగ్ ఆమరణ దీక్షకు మద్దతుగా మంగళవారం గాంధీపార్క్ వద్ద సంఘీభావ దీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీని మాత్రమే అమలు చేయాలని జగ్జీత్‌సింగ్ కోరుతున్నారని వివరించారు. దేశంలోని రైతాంగం కన్నెర్ర చేస్తే మోదీ వంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోతారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము, సీపీఐ జిల్లా కార్యదర్శి ఏ.మారుతీ వర ప్రసాద్, సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, ప్రజా నాట్యమండలి జాతీయ కార్యదర్శి షేక్ గని, న్యాయవాది సీజే ప్రతాప్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ షేక్ సుభాని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment