పెట్టుబడి సాయం కోరుతూ నేడు బెజవాడలో రైతుల ధర్నా
ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్నా శివశంకరరావు
తెనాలి: ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేల చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం అమలుతో సహా పలు డిమాండ్లతో ఈనెల 17వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న ధర్నాలో రైతాంగం పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్నా శివశంకరరావు కోరారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. 2024–25 ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ముగిసిందని, రబీ సీజను కూడా సగానికి పూర్తయినా పెట్టుబడి సాయం ఇవ్వకపోవటం అన్యాయమన్నారు. ఉచిత పంటల బీమా కొనసాగించాలని, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. వాణిజ్య, ఉద్యాన సహా మిగిలిన అన్ని పంటలకు ధరలు పడిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రభుత్వం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అదనపు చార్జీలను రద్దుచేయాలని కోరారు. పాడి రైతులకు పొరుగు రాష్ట్రాల్లో ఇస్తున్న విధంగా లీటరుకు రూ.5 బోనస్ ఇవ్వాలని, కౌలురైతులకు బ్యాంక్ రుణాలు, సబ్సిడీలను అందించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధ నకు శుక్రవారం విజయవాడలోని అలంకార్ సెంట ర్‌లోని ధర్నాచౌక్‌కు తరలిరావాలని రైతులకు విజ్ఞప్తిచేశారు. వీరితోపాటు రైతు ప్రతినిధులు కన్నెగంటి భాస్కర్‌చంద్, పోతురాజు కోటేశ్వరరావు, జెట్టి బాలరాజు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment