శుక్రవారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2025
శావల్యాపురం: రైతు వద్ద ప్రతి ధాన్యపు గింజ మద్దతు ధరకు కొంటామని ప్రగల్భాలు పలికిన టీడీపీ కూటమి సర్కారు మాట తప్పింది. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు పూర్తిగా చేయలేక చేతులెత్తేసింది. ఫలితంగా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడంతో ధాన్యాన్ని ధర వచ్చినప్పుడు అమ్ముకుందామని పురులు కట్టి వాటిల్లో దాచుకుంటున్నారు. మాయదారి సర్కారు వల్ల కష్టాలు దాపురించాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు దళారులను ఆశ్రయించి తెగనమ్ముకుంటున్నారు.
ప్రస్తుతం బస్తా ధాన్యం ధర గ్రామాల్లో రూ.1,400 వరకు పలుకుతోంది. ఈ ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. పురులు కట్టి ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు.
ఎకరానికి రూ.40వేలు ఖర్చు
గత ఖరీఫ్‌లో పల్నాడు జిల్లాలో 35వేల హెక్టార్లలో వరి సాగైంది. రెండు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి మురళీ చెప్పారు. ఒక్కో ఎకరానికి రైతులు రూ.40 వేల వరకు సాగు ఖర్చులు చేశారు. ఎకరానికి 30 నుంచి 40 బస్తాల దిగుబడి వచ్చింది. 76 కేజీల బస్తా ప్రస్తుతం బయట మార్కెట్లో రూ.1,400 పలుకుతుండగా, ఇది ఏమాత్రం సరిపోదని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వం 76 కేజీల ధాన్యం బస్తాను మద్దతు ధర రూ.1720కు కొంటామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు జిల్లా మొత్తమ్మీద ఐదువేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నది. ఇప్పుడు కొనుగోళ్లు ఆపివేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
న్యూస్‌రీల్
ధాన్యం రైతు దైన్యం నిలిచిన ప్రభుత్వ కొనుగోళ్లు ఇంకా రైతుల వద్దే ఖరీఫ్ నిల్వలు బయట ధర లేక అష్టకష్టాలు పురుల్లో దాచుకుంటున్న వైనం
జిల్లాలో ఇలా..
ఖరీఫ్‌లో వరి సాగు
: 35,000 హెక్టార్లు
ధాన్యం దిగుబడి
: 2,00,000 మెట్రిక్ టన్నులు
ఇప్పటివరకు కొన్నది
: 5,000 మెట్రిక్ టన్నులు
Comments
Please login to add a commentAdd a comment