పోస్టుమార్టం నివేదిక రానిదే నిర్ధారణకు రాలేం
మద్యం తాగి ఇద్దరు మృతిచెందిన ఘటనపై ఎకై ్సజ్ సీఐ తులసి
క్రోసూరు/అచ్చంపేట: అచ్చంపేట మండలంలోని చామర్రులో ఈనెల 14న మద్యం తాగడం వల్ల అనారోగ్యానికి గురై ఇద్దరు మృతి చెందారనేది నిజం కాదని, వదంతి మాత్రమేనని క్రోసూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ టి.తులసి వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక రానిదే వారిద్దరూ ఎలా చనిపోయారనే దానిపై నిర్ధారణకు రాలేమని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. చామర్రు గ్రామ నివాసి గౌతుకట్ల కోటయ్య (80) అనారోగ్యంతో చనిపోవటంతో అతని దహన సంస్కారాలకు హాజరైన మృతుని కుమారుడు గౌతుకట్ల నాగేశ్వరరావు, తెల్లమేకల నాగేశ్వరరావు మద్యం తాగి అనారోగ్యానికి గురై సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని, దీనిపై విచారణ చేపట్టామని తులసి వివరించారు. వారిద్దరి మృతికి మద్యమే కారణమని చెప్పలేమని, వారు తాగిన కూల్‌డ్రింక్ లేదా ఆహారంలోనూ ఏదైనా కలిసి ఉండొచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment