యథేచ్ఛగా మద్యం అమ్మకాలు
చుండూరు(వేమూరు): సంక్రాంతి సంబరాల మాటున వేమూరు నియోజకవర్గంలో కోడి పందేల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పేకాట, మద్యం ఏరులై పారింది. మద్యం ఇష్టారాజ్యంగా అమ్ముతున్నా ఎకై ్సజ్ అధికారులు పట్టించు కోలేదు. వాస్తవానికి మద్యం షాపుల్లోనే అమ్మకాలు చేయాలి. నిబంధనలను పక్కన పెట్టి బరుల్లో బెల్టు షాపులు జోరుగా నిర్వహించారు. వేమూరు మండలంలోని జంపనిలో ఏకంగా పందేల దగ్గర రెండు బెల్టు షాపులు ఏర్పాటు చేసి జోరుగా మద్యాన్ని అమ్మారు. కొల్లూరు మండలంలోని క్రాప వద్ద, భట్టిప్రోలు మండలంలోని పల్లెకోనలో బరుల వద్ద బెల్టు షాపులు నిర్వహించారు. చుండూరు మండలంలోని కోడి పందేలు బరిలో మద్యం అమ్ముతున్నా అధికారులు పట్టించు కోలేదు.
జూదగాడిపై దాడి
దొంగ ముక్కలతో పేకాడుతున్న వ్యక్తికి దేహశుద్ధి
దొంగ ముక్కలతో పేకాడుతున్న వ్యక్తికి దేహశుద్ధి చేశారు. చుండూరు మండలంలోని కేఎన్ పల్లి బరి దగ్గర దొంగ ముక్కలతో పేకాడుతున్న వ్యక్తిని పట్టుకున్నారు. బరి దగ్గర ఇష్టారాజ్యంగా కొట్టారు. తర్వాత ఆటోలో వేటపాలెం తీసుకెళ్లి అక్కడ కూడా కొట్టారు. గ్రామస్తులు 100 కాల్ ఫోన్ చేయడంతో చుండూరు పోలీసులు హడావుడిగా సంఘటన స్థలం వద్దకు చేరుకుని దాడిని ఆపారు.
పేకాటలో తప్పు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని, దాడి చేయకూడదని తెలిపారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ షేక్ రహిమాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment