రోడ్డు ప్రమాదంలో ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డ్ మేనేజర్ దుర్
నాదెండ్ల: రోడ్డు ప్రమాదంలో గుంటూరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కలెక్షన్ మేనేజర్ మన్నెం వెంకటరాజేష్ (45) దుర్మరణం పాలయ్యారు. గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై సాతులూరు గ్రామ సమీపంలోని హోసన్న ప్రార్థనా మందిరం వద్ద గురువారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ఎస్‌ఐ జి.పుల్లారావు తెలిపిన వివరాల మేరకు గుంటూరు వసంతరాయపురం సమీపంలోని వెంగయ్యనగర్ నాలుగో లైనుకు చెందిన మన్నెం వెంకటరాజేష్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు విభాగంలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గుంటూరుకు చెందిన మరో వ్యక్తి వినుకొండ నవీన్ క్రెడిట్ కార్డు ఏజెన్సీ టీం లీడర్‌గా పనిచేస్తున్నాడు. వీరిరువురూ ద్విచక్రవాహనంపై నరసరావుపేటకు వెళ్తూ సాతులూరు చర్చి వద్దకు రాగానే గేదెను తప్పించే క్రమంలో వెనుకగా వస్తున్న కియా కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వెంకటరాజేష్‌ను కారులో నరసరావుపేట తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వాహనం నడుపుతున్న నవీన్‌కు గాయాలు కావటంతో ఆసుపత్రిలో చేర్చారు. వెంకటరాజేష్ మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని మేనల్లుడు వేములకొండ విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
మరో వ్యక్తికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment