విధి నిర్వహణలో అప్రమత్తత అవసరం
ఆర్టీసీ జిల్లా ప్రజారవాణా అధికారి శ్రీనివాసరావు
నరసరావుపేట: ఆర్టీసీ సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్.శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్‌లో డిపో మేనేజర్ జీవీఎస్‌ఎస్ మూర్తి అధ్యక్షతన రోడ్డు భద్రతా మాసోత్సవాల ప్రారంభోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ భద్రతా మాసోత్సవాలు వచ్చే నెల 15వరకు నిర్వహించటం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నెల రోజుల కార్యక్రమాలను గురించి వివరించారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లకు విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేశారు. గ్యారేజీ ఇన్‌చార్జి లావణ్య, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment