చుండూరు(వేమూరు): మద్యం బీరు సీసాలతో యువకులు పొడుచుకున్నారని ఎస్‌ఐ షేక్ రహిమాన్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం...సంక్రాంతి సంబరాలలో భాగంగా చుండూరు మండలం కేఎన్ పల్లి సమీపంలో కోడి పందేలు నిర్వహించారు. బుధవారం చేబ్రోలు గ్రామానికి చెందిన మదాసు అక్షయకుమార్, మాటుపల్లి రాజేష్, ముసలా శ్రీనివాసరావులు కోడి పందేలు చూసేందుకు వచ్చారు. కోడి పందేలు చూసిన తర్వాత ముగ్గురు కలసి సైకిల్ స్టాండ్ వద్ద బీరు తాగుతున్నారు. అక్షయకుమార్, శ్రీనివాసరావు మధ్య మాటామాట పెరిగింది. దీంతో శ్రీనివాసరావు బీరు బాటిల్ పగలు కొట్టి అక్షయకుమార్‌ను పొడిచాడు. అనంతరం రాజేష్ బీరు బాటిల్‌తో శ్రీనివాసరావును పొడిచాడు. ముగ్గురికి గాయాలయ్యాయి. 108 వాహనంలో అక్షయకుమార్, రాజేష్‌లను తెనాలిలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీనివాసరరావును ఽప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. ముగ్గురిపైన కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
బీరు సీసాలతో పొడుచుకున్న యువకులు
Comments
Please login to add a commentAdd a comment