యువకుడిపై హత్యాయత్నం
తెనాలి రూరల్: తెనాలిలో యువకుడిపై హత్యాయ త్నం జరిగింది. వెండి పని చేసుకునే తేలప్రోలు గ్రా మానికి చెందిన షేక్ సుభానీపై గురువారం ఉదయం నడిరోడ్డుపై ఈ హత్యాయత్నం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. తేలప్రోలుకు చెందిన షేక్ సుభానీ తన సోదరుడు బాజితో కలిసి ఓ ఫంక్షన్‌కు మిత్రులను పిలిచేందుకు తెనాలి వచ్చాడు. గాంధీచౌక్ నుంచి కొత్తపేట వెళ్లే దారిలో రోడ్డు పక్కన నిలబడి ఉండగా తేలప్రోలుకు చెందిన అరాఫత్, ఇర్ఫాన్‌లు వచ్చి కత్తితో దాడి చేశారు. సుభానీ తీవ్రంగా గాయపడటంతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. సుభానీ బంధువులు, ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న సోదరుడు మాట్లాడుతూ.. తమ ఊరికే చెందిన అరాఫత్, ఇర్ఫాన్‌లు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. అరాఫత్ తరచూ ఘర్షణకు దిగుతున్నాడని, రెక్కీ నిర్వహించి మరీ కత్తులతో తిరుగుతున్నారని తెలిపారు. అదేమంటే తమకు జనసేన అండ ఉందని చెబుతూ రెచ్చిపోతున్నారని వాపోయారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment