అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
తెనాలి రూరల్: తెనాలిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పట్టణంలోని ముత్తెంశెట్టిపాలెం నుంచి ఇస్లాంపేట వైపు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఆమె మృతి చెంది ఉండటాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. తమిళనాడుకి చెందిన మణి అనే వ్యక్తితో 50 ఏళ్ల ఈ మహిళ కొంత కాలంగా కలిసి ఉంటోందని చెబుతున్నారు. మణి కర్రీ పాయింట్‌లో పని చేస్తుండగా, మహిళ బిక్షాటన చేసేదన్నారు. గత రాత్రి రోడ్డు పక్కన నిద్రించిన మహిళ తెల్లవారే సరికి మృతి చెంది ఉండటం చర్చనీయాంశమైంది. రాత్రి ఇద్దరూ కలిసి మద్యం తాగి గొడవపడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళ ప్రైవేటు శరీర భాగాల నుంచి తీవ్రంగా రక్తస్రావం అయినట్లుగా తెలుస్తోంది. మణిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళ మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ బి. జనార్దనరావు, వన్ టౌన్ సీఐ వి.మల్లికార్జునరావులు పరిశీలించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment