తరాల సంక్రాంతి.. తరగని కాంతి
నరసరావుపేట: పట్టణంలోని మండవ, పెనుగొండ కుటుంబ సభ్యులు 89మంది సంక్రాంతి పర్వదినాన మరోసారి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో నివాసం ఉండే ఈ రెండు కుటుంబాలకు చెందిన వారు గత 11 ఏళ్ల నుంచి సంక్రాంతి పర్వదినాన సమావేశమవుతున్నారు. సుమారు నాలుగు తరాలకు చెందిన వీరు మూడురోజుల పాటు పట్టణంలోని పాతూరులో గల సీతారామస్వామి దేవాలయంలోని కల్యాణ మండపంలో సమావేశమై ఉల్లాసభరితమైన వాతావరణంలో ఆటపాటలతో పండుగ జరుపుకొన్నారు.
గత 11 ఏళ్లుగా సమావేశమవుతున్న మండవ, పెనుగొండ కుటుంబాల నాలుగు తరాల సభ్యులు ఉల్లాసభరిత వాతావరణంలో సంక్రాంతి వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment