ఆర్యవైశ్యులు అన్నిరంగాల్లో ముందుండాలి
తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా
పిడుగురాళ్ల: ఆర్యవైశ్యులు అన్నిరంగాల్లో ముందుండి అందరికీ ఆదర్శవంతంగా నిలబడాలని తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళుతూ మధ్యలో పిడుగురాళ్లలో కాసేపు ఆగారు. పట్టణంలోని ఆర్యవైశ్య నేతలు ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు ఘన స్వాగతం పలికి దుశ్శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ... పిడుగురాళ్ల ప్రాంతానికి చెందిన ఆర్యవైశ్యులు జాతీయ స్థాయిలో పదవుల్లో ఉన్నారని, అన్నిరంగాల్లో ఆర్యవైశ్యులు ముందు ఉండి సేవా కార్యక్రమాలు నిర్వహించి దేశానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం ఉప్పల ఫౌండేషన్ కో–చైర్మన్ ఉప్పల సాయితేజకు కూడా ఘనస్వాగతం పలికారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జూలకంటి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు, విద్యాశాఖ రాష్ట్ర మాజీ డైరెక్టర్ చింతా వెంకట రామారావు, ఆర్యవైశ్య యువ నాయకులు పతంగి అమర్, మద్దాలి శివ, ఆలేటి కనకయ్య, దేవరపల్లి కృష్ణప్రసాద్, తోటా బుచ్చిబాబు, పలువురు ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment