మక్కువ: సాలూరు నియోజకవర్గ టీడీపీలో కొత్తముసలం పుట్టింది. ఎమ్మెల్యే సీటు తనకేనంటూ తేజోవతి ప్రచారం చేస్తున్నారు. పరిచయ కార్యక్ర మం పేరుతో పార్టీ శ్రేణులతో సమావేశమవుతున్నా రు. తనకే సీటువస్తుందంటూ ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఇది మింగుడుపడని టీడీపీ సాలూరు నియోజకవర్గ సమన్వయకర్త సంధ్యారాణి వర్గం భగ్గుమంటోంది. ఇప్పటికే ఓ వైపు సంధ్యారాణి వర్గం, మరోవైపు భంజదేవ్ వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ కేసుల వరకు వెళ్లాయి.
ఇప్పుడు తాజాగా తేజోవతి తెరపైకి రావడం, సాలూరు సీటు జనసేన అభ్యర్థికి కేటాయిస్తారన్న ప్రచారంతో పార్టీలో ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నచందంగా తయారైంది. సీటు తమకే ఇవ్వాలని ఎవరికి వారే అధిష్టానాన్ని ప్రస ణ్ణం చేసుకుంటున్నారు. తమ వర్గం అభ్యర్థికి సీటు ఇవ్వకుంటే ఎట్టి పరిస్థితిలోనే సహకరించేది లేదని సమావేశాలు పెట్టిమరీ స్పష్టం చేస్తున్నారు. మరికొందరు మండల స్థాయి నాయకులు ఒక అడుగు ముందుకు వేసి సంధ్యారాణి తమ కాళ్లుపట్టుకుంటేనే సహకరిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. అసలే ప్రజాదరణలేక కునారిల్లుతున్న సాలూరు నియోజవకర్గ టీడీపీలో వర్గ విబేధాలు పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నాయి.
సమావేశాలు సాక్షిగా..
ఐవీఆర్‌ఎస్ ద్వారా వెలుగులోకి వచ్చిన తేజోవతి టీడీపీ మక్కువ మండల మాజీ అధ్యక్షుడు పెంట తిరుపతిరావు ఆధ్వర్యంలో ఇటీవల డి.శిర్లాం, కోన గ్రామాల్లో బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. తనే అభ్యర్థినంటూ తేజోవతి ప్రచారం చేశారు. ఇది నచ్చని ప్రస్తుత టీడీపీ మండలాధ్యక్షుడు వేణుగోపాలరావు, సంధ్యారాణితో కలిసి తేజోవతి వర్గంపై విమర్శలు గుప్పించారు. 2014 నుంచి 2019 వరకు పార్టీని అడ్డంపెట్టుకొని, కోట్లు సంపాదించి, అధికారం కోల్పోయిన వారంరోజులకే పార్టీని వీడిన వలస పక్షులకు పార్టీ నిబంధనలు అర్ధంకావంటూ మండిపడ్డారు.
దీనికి కౌంటర్‌గా తిరుపతిరావు విలేకరుల సమావేశం సాక్షిగా గుమ్మడి సంధ్యారాణిపై పలు ఆరోపణలు చేశారు. 2014 టీడీపీ ప్రభుత్వం హ యంలో చేపట్టిన ప్రహరీ నిర్మాణాల బిల్లుల మంజూరులో ఎమ్మెల్సీగా పనిచేసిన సంధ్యారాణి కనీసం సాయం చేయలేదన్నారు. బిల్లుల మంజూరులో వైఎస్సార్‌సీపీ నాయకులు సహకరించారని, ఇది చెప్పుకునేందుకే సిగ్గుచేటన్నారు. టీడీపీ నియమించిన సర్వేటీమ్స్ తేజోవతి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నాయన్నారు. ఒకవేళ అధిష్టానం సంధ్యారాణి కి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే, మా వర్గం నాయకుల కాళ్లుపట్టుకుంటే తప్ప సహకరించేది లేదని తిరుపతిరావు తెగేసి చెప్పారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీ నుంచి సుమారు రూ.2కోట్లు ఎవరిద్వారా, ఎవరిరెవరకి అందాయో? అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు నాయుడి దృష్టికి ఆధారాలతో సహా తీసుకెళ్తానన్నారు. మక్కువలో ఇటీవల ఏర్పాటుచేసిన సమావేశంలో తేజోవతి మాట్లాడుతూ తన అభ్యర్థిత్వాన్ని గుళ్ల వేణుగోపాలరావు తిరస్కరించ డం విచారకరమన్నారు. నేను అభ్యర్థిని కాదంటే ఐవీఆర్‌ఎస్ సర్వేలో నా పేరు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. 20 ఏళ్ల ఉపాధ్యాయవృత్తి సర్వీసును వదిలి రాజకీయాల్లో వచ్చానని, అభ్యర్థికాదంటే ఒప్పుకునేది లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment