నిన్ను నమ్మలేం బాబూ..!
కూటమి మేనిఫెస్టోతో ఉద్యోగుల్లో ఆందోళన
అభ్యర్థులకు షాకిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళి
పార్వతీపురంటౌన్: టీడీపీ మేనిఫెస్టోతో ఉద్యోగుల్లో మార్పు కనిపిస్తోంది. ఇందుకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే నిదర్శనం. మూడు రోజులుగా సాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో ఉద్యోగులంతా వైఎస్సార్‌ిసీపీకి పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా 6810 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉంటే రెండు రోజుల్లోనే భారీగా ఓటింగ్ నమోదైంది. ఇందులో ఎక్కువ శా తం ఓటర్లు వైఎస్సార్‌సీపీ వైపే మొగ్గుచూపినట్లు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమలుకాని హామీలతో ప్రజల్ని బురిడీ కొట్టించాలని చంద్రబా బు చూస్తున్నారని ఉద్యోగులు ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు ఓటింగ్ సరళిని చూస్తే అర్థమవుతోంది. కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను అమలు చేయాలంటే తమ జీతాల్లో కోత తప్పదని భావించి ఉద్యోగులు వారి ఓట్లను గంపగుత్తగా వైఎస్సార్‌సీ పీ అభ్యర్థులకు వేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు చెమటలు పట్టిస్తోంది. ఉద్యోగులంతా తమకు మద్దతుగా నిలుస్తారనుకుంటే..మొత్తం వ్యతిరేకమయ్యారని తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు కూటమి శ్రేణులే చర్చించుకుంటున్నాయి. కూటమి నేతలు సూపర్‌సిక్స్ పేరుతో ప్రవేశ పెట్టిన పథకాల అమలు సాధ్యం కాదని ఉద్యోగులు తేల్చేశారు. వాటిని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3 లక్షల కోట్లు అవసరం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. మొన్నటివరకు చంద్రబాబు అండ్ కో ఏపీ శ్రీలంక అవుతుందని చేసిన ప్రచారం వారి మేనిఫెస్టోతో ఇప్పుడేమవుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో ఓట్ల కొనుగోలుపై ఫోకస్
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్ అనుకూలంగా లేకపోవడంతో కూటమి అభ్యర్థులు షాక్‌కు గురవుతున్నారు. దీంతో పల్లెలు, పట్టణాల్లోని ఓటర్ల కొనుగో లుపై దృష్టి సారించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులు అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కొందరు ఓటర్ల ను ప్రలోభాలకు గురిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్వతీపురం పట్టణంలోని పలువురు టీడీ పీ నేతలు గ్రామాల్లో ఓటుకు రూ. 3వేల వరకు ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పాలకొండ నియోజకవర్గంలో గిరిజన ఓటర్లను మభ్యపెట్టేందుకు జనసేన, కూటమి అభ్యర్థులు ఓటుకు రూ.2వేల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. సాలూరు నియోజకవర్గంలో టీడీపీ ప్రచారానికి ఎవరూ రాకపోవడంతో ప్రతి వార్డుకు, గ్రామానికి రోజుకు రూ.5వేలు చొప్పున ఖర్చు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇకపోతే ఎన్నికల సమయంలో తమకు అనుకూలంగా ఉండేందుకు కొందరు అధికారులను రోజూ మద్యం బార్లకు తీసుకెళ్లి బేరసారాలు అడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే..నిత్యం గ్రామాల్లో కూటమి అభ్యర్థుల మాట వినకపోతే వారితో గొడవలకు దిగి ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చుపెడుతున్నారు.
ప్రజాస్పందన కరువు
కూటమి అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న నియోజ కవర్గాల్లో ఆశించిన స్థాయిలో ప్రజాదరణ కనిపించడంలేదు. డబ్బులిచ్చి జనాలను తరలిస్తున్నా, కొద్ది సేపటికే ముఖం చాటేస్తున్నారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సభలకు జనం రాకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తుపై ఆయనకు ఎటూ పాలుపోవడంలేదు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులను కొన్నంత సులభంగా ఓట్లు బదిలీ అవుతాయనే వారి భ్రమ సైతం తొలిగిపోయింది. ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టోను ప్రకటించడంతో చంద్రబాబుపై నమ్మకం ప్రజల్లో మరింత సన్నగిల్లింది.
ఓటమి భయంతోనే పర్యటనలు
కూటమి అభ్యర్థుల ప్రచారానికి జనాదరణ కరువైంది. వార్డుల్లో, గ్రామాల్లో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి స్థానిక నాయకులు సొంతంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో స్థానిక టీడీపీ నాయకులే ప్రచారానికి డుమ్మా కొడుతున్నారు. ఏమి చేయాలో తోచక అది కప్పి పుచ్చుకొనేందుకు అసెంబ్లీ, లొక్‌సభ నియోజకవర్గాల ప్రచారానికి సినీనటులు, కేంద్రమంత్రులు వస్తున్నారని జిల్లా అంతా కోడై కూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment