సుదూర ప్రాంతాలకు బదిలీలు సరికాదు
పాలకొండ రూరల్: ఐటీడీఏ పరిధిలోని గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న గెస్ట్ అధ్యాపకుల సమ్మె క్రమంలో రెగ్యులర్ ఉపాధ్యాయులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయటం సహేతుకం కాదని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పాలక పురుషోత్తమ్ అన్నారు. పాలకొండలో ఎస్టీయూ పార్వతీపురం మన్యం జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తమ్ మాట్లాడుతూ సంక్రాంతి పండగ క్రమంలో బకాయిలున్న డీఏ, పీఎఫ్‌తో పాటు సరండర్ లీవ్ బకాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బోధనేతర సిబ్బంది ఏర్పాటు చేయాలన్నారు. జీఓ నంబర్ 117 ప్రాప్తికి హైస్కూల్స్‌లో విలీనం చేసిన 3, 4 తరగతులను తక్షణమే ప్రాథమిక పాఠశాలలకు తరలించి, ప్రాథమిక విద్య బలోపేతానికి కృిషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా పాలక పురుషోత్తమ్, మజ్జి మురళీబాబులను కొనసాగిస్తూ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆర్థిక కార్యదర్శిగా అంపావల్లి కేశవరావును కొనసాగించాలని నిర్ణయించారు. ఎన్నికల పరిశీలకులు ఎస్.శ్రీనివాసపట్నాయిక్, మల్లేశ్వరరావు, ధర్మరాజు, జయప్రకాష్, ఆనందరావు, వైకేఎం నాయుడు తదితరులున్నారు.
ప్రభుత్వ తీరుపై ఎస్టీయూ అభ్యంతరం
Comments
Please login to add a commentAdd a comment