ముగిసిన సూపర్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్
చీపురుపల్లి: పట్టణంలోని జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ఆవరణలో జరిగిన సూపర్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. పట్టణానికి చెందిన రన్ మిషన్ సంస్థ అధ్వర్యంలో జనవరి 9న ప్రారంభమైన సూపర్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 13న భోగి రోజు రాత్రి ముగిసింది. ఫ్లడ్ లైట్లు వెలుతురులో జరిగిన ఈ టోర్నమెంట్‌లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి 60 జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విశాఖపట్నం జట్టుకు రూ.30 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన రన్ మిషన్ జట్టుకు రూ.20 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన లావేరురోడ్ జట్టుకు రూ.10 వేలు, నాల్గవ స్థానంలో నిలిచిన వినయ్ సిక్సర్స్ జట్టుకు రూ.5 వేలు నగదు బహుమతి అందజేశారు.
మూడు జిల్లాల నుంచి పాల్గొన్న 60 జట్లు
Comments
Please login to add a commentAdd a comment