పార్వతీపురం: తోటపల్లి వేంకటేశ్వరస్వామి విగ్రహ పునఃప్రతిష్టోత్సవ పోస్టర్‌ను కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ కలెక్టర్ కార్యాలయంలో తోటపల్లి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్ర హ పునఃప్రతిష్టోత్సవం జరుగుతుందని, పుష్పగిరి పీఠాధిపతి శంకర భారతి స్వామి పాల్గొంటారని కమిటీ సభ్యుడు డి.పారినాయుడు తెలిపారు. 7న యంత్ర ప్రతిష్ట, కుంభాభిషేకం తదితర పూజలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణానికి గరుగుబిల్లి మండలం గిజబ గ్రామానికి చెందిన ప్రసాద్ లక్ష రూపాయల చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా ట్రస్టు కోశాధికారి దుర్గారావుకు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు చుక్క భాస్కరరావు, శ్రీరామచంద్రమూర్తి, జి.తవిటినాయుడు, సత్యం మాస్టార్, వడ్డి మమేష్, టి. శివకేశవరావు, హరి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment