బొబ్బిలి: డివిజనల్ పోలీసు అధికారి పి.శ్రీనివాసరావుకు నర్సీపట్నం బదిలీ అయింది. ఈయన స్థానంలో భవ్యారెడ్డి నియామకం అయినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.
బంగారు వెండి ఆభరణాల చోరీ
బొబ్బిలి: సంక్రాంతి పండగకు స్వగ్రామాలకు కుటుంబ సభ్యులు వెళ్లిన నేపథ్యంలో పట్టణంలోని దాడితల్లి కాలనీలో రెండు ఇళ్లలో దొంగలు చొరబడి బంగారు, వెండి అభరణాలు దొంగిలించారు. మరిశర్ల సింహాచలం అనే ఉపాధ్యాయుడి ఇంట్లో దూరి కిలో వెండి, తులంన్నర బంగారు వస్తువులు అపహరించుకుపోయారు. అదే కాలనీలో ఉంటున్న గొట్టాపు వేణు అనే కాజా కళాశాల అధ్యాపకుడి ఇంట్లో 350 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదును అనుసరించి క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలను సేకరించామని, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఎస్‌ఐ ఆర్.రమేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment