వర్ధంతి సభా? విజయోత్సవ ర్యాలీయా?
సాలూరు పట్టణంలో ఓపెన్ టాప్ కారులో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పార్టీ జెండాలు ఊపుతూ శనివారం ముందుకు సాగడాన్ని చూసిన స్థానికులు తొలుత విజయోత్సవ ర్యాలీ అని భ్రమపడ్డారు. ఎన్టీఆర్ వర్ధంతి రోజున మంత్రి ఇలా ముందుకు సాగారన్న విషయం తెలుసుకుని విస్తుపోయారు. వర్ధంతిని సైతం పండగలా భావించడాన్ని చూసి ఆ పార్టీ నాయకులే కొందరు గుసగుసలాడారు. అమర్ రహే అనాల్సింది పోయి విజయహాసం ప్రదర్శించడాన్ని తప్పుబట్టారు. టీడీపీ వ్యవస్థాపకుడు మరణించిన రోజున సంతాపాలు తెలిపి, ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకోవాల్సింది పోయి ఇలా సంతోషంగా విజయోత్సవ ర్యాలీ మాదిరిగా ముందుకు సాగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. – సాలూరు
Comments
Please login to add a commentAdd a comment