స్వచ్ఛ మన్యం దిశగా అడుగులు
గరుగుబిల్లి: స్వచ్ఛ ఆంధ్రా దిశగా అడుగులు వేస్తున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి జట్టు సంస్థ కార్యాలయ ప్రాంగణంలో స్వచ్ఛ సుందర పార్వతీపురం మన్యం జిల్లా మాస్టర్ ట్రైనీస్ శిక్షణను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ స్వచ్ఛ ఆంధ్రా–స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. పర్యావరణ పరిరక్షణలో సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ప్రజారోగ్య పరిరక్షణకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంపై ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను 80 రోజులపాటు గ్రామాల్లో ప్రత్యక్షంగా అమలు చేయాలన్నారు. ఏపీ స్వచ్ఛ రాష్ట్ర సలహాదారు శ్రీనివాసచార్యులు మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో నాబార్డు డీడీఎం దినేష్ రెడ్డి, సెట్విజ్ సీఈఓ ఎన్.రామ్‌గోపాల్, జట్టు ట్రస్టీ డి. పారినాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛగ్రామాల నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. జట్టు భావసమాఖ్య ఆశ్రమ నిర్వాహకులు పద్మజ, డీఎండబ్ల్యూఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు శాంతి, జట్టు సిబ్బంది, మాస్టర్ ట్రైనీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment