సైకిల్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి
సీతానగరం: మండలంలోని రాష్ట్ర రహదారిలో సువర్ణముఖీ నది బ్రిడ్జి సమీపంలో సైకిల్‌తో సీతానగరం వస్తున్న వ్యక్తిని వెనుక నుంచి వస్తున్న ట్యాంకర్ లారీ ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని బళ్లకృష్ణాపురం గ్రామానికి చెందిన అక్కేన సత్యనారాయణ(53) శనివారం తామరఖండి రైస్‌మిల్లు నుంచి సైకిల్‌పై సీతానగరం మీ సేవ కేంద్రానికి వస్తుండగా బొబ్బిలి నుంచి పార్వతీపురం వైపు వస్తున్న ట్యాంకర్ లారీ సువర్ణముఖీ నది బ్రిడ్జి సమీపంలో వెనుక నుంచి వచ్చి ఢీకొంది. దీంతో సంఘటన స్థలంలో దుర్మరణం చెందాడు. మృతుడి కుమారుడు కిరణ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎం.రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
గాయపడిన వారిలో
ఇద్దరి మృతి
సీతంపేట: మండలంలోని అడలి వ్యూ పాయింట్ సమీపంలో మూడు రోజుల క్రితం ఆటో అదుపు తప్పడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి వేర్వేరు ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న వారిలో ఇద్దరు శనివారం మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిలో బూర్జ మండలం కురుంపేట గ్రామానికి చెందిన బొడ్డు యశోదమ్మ(50) శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అలాగే సీతంపేట మండలం వెల్లంగూడకు చెందిన సవర రెల్లియ్య(52) విశాఖపట్నం కేజీహెచ్‌లో వైద్య సేవలు పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
చెట్టు పైనుంచి జారిపడిన వ్యక్తి మృతి
సీతంపేట: మండలంలోని దిగువకారిమానుగూడకు చెందిన సవర బుడ్డయ్య (71) చెట్టు పైనుంచి జారిపడిన సంఘటనలో శనివారం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందినట్టు ఎస్‌ఐ వై.అమ్మన్నరావు తెలిపారు. శుక్రవారం బిల్లగూడ గ్రామ సమీపంలో ఉన్న ములంచెట్టు ఎక్కి ములంకాడలు తీసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారిపడడంతో గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యసేవల కోసం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పాచిపెంట: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటసురేష్ తెలిపిన వివరాలు... గొట్టూరు పంచాయతీ పెదగులిగుద్ది గ్రామానికి చెందిన కొర్ర పొట్టయ్య(40) తన భార్యను రాయిగుడ్డివలస పంచాయతీ పనుకువలస గ్రామంలో ఆమె కన్నవారింట ద్విచక్ర వాహనంపై శనివారం తీసుకువెళ్లి దించాడు. తరువాత తిరుగు ప్రయాణమై ఇంటికి వస్తుండగా ఆరో నంబరు జాతీయ రహదారిపై పూడి జంక్షన్ వద్ద అదుపు తప్పి పడిపోయాడు. తలకు తీవ్రమైన గాయమైంది. స్థానికులు పొట్టయ్యను 108లో సాలూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
ఈ–హుండీ ప్రారంభం
విజయనగరం రూరల్: మండలంలోని సారిక పంచాయతీ పరిధిలోని రామనారాయణం ఆలయంలో శనివారం ఐఏబీ బ్యాంకు మేనేజర్ సాహు ఈ–హుండీని ప్రారంభించినట్లు ఆలయ వ్యవస్థాపకుడు నారాయణం శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశగా వాల్మీకి రీసెర్చ్ సెంటర్, వేద పాఠశాల, 80 అడుగులు ఆంజనేయ విగ్రహాంపై రామాయణ ఇతివృత్తాన్ని తెలిపే లేజర్ షోను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కమిటీ సభ్యులు ప్రణాళిక ప్రకారం భవిష్యత్తులో మరింత రామాయణ గాధను ప్రతీ ఒక్కరికి తెలియజేసేలా ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment