జాతర ఏర్పాట్లలో నిర్లక్ష్యం తగదు
–8లో
ఆదివారం శ్రీ 19 శ్రీ జనవరి శ్రీ 2025
సాక్షి, పార్వతీపురం మన్యం: ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు అటవీ ఉత్పత్తుల్లో ఆర్థికంగా దన్నుగా నిలిచేది జీడి పంటే. కొంతకాలంగా జీడిపిక్కలకు మార్కెట్ ధర లేకపోవడం.. పిందె దశలో వర్షాలకు తేనెమంచు ప్రభావం వల్ల పంట దెబ్బతినడం, పిందె రాలి పోవడం వంటి కారణాల వల్ల గిరిజన రైతులు తీవ్రంగా నష్టాలు చవిచూస్తున్నారు. జీడి పిక్కలకు కనీస మద్దతు ధర చెల్లించాలని కొన్నాళ్లుగా రైతులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. జిల్లాలో దాదాపు 65 వేల ఎకరాల్లో జీడి తోటలు సాగులో ఉన్నాయి. 30 వేల మంది రైతులు వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఒక్క సీతంపేట ఏజెన్సీలోనే సుమారు 25 వేల హెక్టార్ల వరకు ఏటా సాగవుతోంది. సాధారణంగా జీడి పంట డిసెంబర్‌లో పూత దశకు వస్తుంది.
ఆదుకోని యంత్రాంగం..
జిల్లాలోని సీతంపేట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు జీడి తోటలపైనే చాలా ఏళ్లుగా బతుకుతున్నారు. ప్రసుత్తం జీడి పిక్కల ధర మార్కెట్లో కిలో రూ.180 వరకు ఉంది. గిరిజనులకు పంట చేతికందేసరికి దళారులు, వ్యాపారులు సిండికేట్‌గా మారుతున్నారు. జీడి పిక్కలను కిలో రూ.100 నుంచి రూ.120లోపే కొనుగోలు చేస్తున్నారు. దీంతో గిరిజన రైతులకు పెట్టుబడి కూడా దక్కడం లేదు. వరి, మొక్కజొన్న, పత్తి మాదిరి జీడి పిక్కలకు మద్దతు ధర ఇవ్వాలని రైతు, ప్రజాసంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. క్వింటా పిక్కలు రూ.18 వేల చొప్పున జీసీసీ కొనుగోలు చేయాలని కోరుతున్నాయి. ఆ దిశగా చర్యలు కానరావడం లేదు.
జీసీసీ ద్వారా
కొనుగోలు చేయాలి
జీడిపిక్కలను క్వింటా రూ.18 వేలు చొప్పున జీసీసీ కొనుగోలు చేయాలి. తక్షణమే జీడి ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించి, అక్కడ గిరిజన యువతకు ఉపాధి కల్పించాలి. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా గిరిజనులు జీడితోటలపైనే ఆధారపడుతున్నారు. పంట పండకపోయినా, ధర లేకపోయినా తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– కొల్లి గంగునాయుడు, వి.రమణ,
సీపీఎం నాయకులు
న్యూస్‌రీల్
ప్రకటనలకే ప్రాసెసింగ్ యూనిట్లు
జీడి పిక్కల ద్వారా మంచి ఆదాయం పొందేలా ఐటీడీఏల పరిధిలో ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభించాలని అధికారులు తరచూ ప్రకటనలైతే చేస్తున్నారు గానీ.. ఆచరణలోకి రావడం లేదు. జీడిపప్పు మార్కెటింగ్‌లో రైతులు దళారుల బారిన పడకుండా వన్‌ధన్ వికాస్ కేంద్రాల ద్వారా మంచి ధర కల్పించేలా చూడాలని వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నారు. గుమ్మలక్ష్మీపురం, సాలూరుల్లో యూనిట్లను స్థాపించనున్నట్లు చెబుతున్నారు. ఇవన్నీ ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. గిరిజన రైతులకు మేలు చేసేందుకు సీతంపేట ఐటీడీఏ పరిధిలో గతంలో ఏడు జీడి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. గిరిజన మండలాల పరిధిలోని మహిళా సంఘాల ద్వారా సుమారు రూ.15 లక్షలు వెచ్చించి వీటిని నెలకొల్పారు. ఈ యూనిట్ల ద్వారా గిరిజనులే నేరుగా జీడిపిక్కలు తీసుకువచ్చి, వారే జీడి పప్పును మార్కెట్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కడా పూర్తిస్థాయిలో పని చేయని పరిస్థితి ఉంది. దీనికితోడు యూనిట్ల స్థాపనలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలను వెలుగు అధికారులు మూటగట్టుకున్నారు.
ఓ వైపు మంచుతో పంటకు నష్టం
మరోవైపు పంటకు గిట్టుబాటు ధర కరువు
బయట మార్కెట్‌లో కిలో జీడిపిక్కల ధర రూ.180
గిరిజన రైతులకు చెల్లిస్తున్నది కిలోకు రూ.100 నుంచి రూ.120
క్వింటా పిక్కలు రూ.18వేలకు కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment