హోటల్ గదిలో యువకుని మృతి
శృంగవరపుకోట: హోటల్ గదిలో యువకుని మృతి కొత్తవలస పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. కొత్తవలస పంచాయతీకి కూతవేటు దూరంలో ఉన్న స్టార్ రూమ్స్ హోటల్లో విశాఖపట్నం విమాన్‌నగర్‌కు చెందిన యువకుడు బస చేశాడు. కాగా శనివారం సాయంత్రం హోటల్ సిబ్బంది తమ హోటల్ గదిలో యువకుడు ఉరి వేసుకుని మరణించినట్టు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ షణ్ముఖరావు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని జేబులో ఉన్న ఆధార్‌కార్డు ఆధారంగా మృతుడు విమాన్‌నగర్ ప్రాంతానికి చెందిన జీవన్‌శర్మగా గుర్తించారు. మృతుని కుటుంబీకులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు. కాగా యువకుని మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment