కలెక్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు
పార్వతీపురం: కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్టర్ కేక్‌ను కట్‌చేశారు. జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక, పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్‌ఓ కె.హేమలత, జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
పత్రాలు చూపించి రాయితీలు పొందండి
సాలూరు: అవసరమైన పత్రాలు చూపించి ఎస్సీ, ఎస్టీలు విద్యుత్ రాయితీలు పొందాలని ఏపీఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీరు చలపతిరావు కోరారు. విద్యుత్ బిల్లుల భారం, కనెక్షన్ల తొలగింపుపై సాలూరు 25వ వార్డు బంగారమ్మపేటకు చెందిన ఎస్సీ మహిళలు ఇటీవల ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. కాలనీని విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం పరిశీలించారు. బకాయి బిల్లులు చెల్లించకపోవడంతోనే కనెక్షన్లు తొలగించినట్టు చెప్పారు. ఆధార్, కుల, ఆదాయ, రేషన్ కార్డు తదితర ధ్రువపత్రాలను వార్డు సచివాలయంలో చూపించి విద్యుత్ రాయితీకి అర్హత పత్రం పొందాలని సూచించారు. వినియోగదారు చార్జీల కింద ప్రతినెలా రూ.25 నుంచి రూ.50 చొప్పున విధిగా చెల్లించాలన్నారు.
శంబర జాతరకొచ్చే
భక్తులకు వైద్యసేవలు
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని డీఎంహెచ్‌ఓ భాస్కరరావు తెలిపారు. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో జరిగే తొలేళ్లు, సిరిమానోత్సవ సమయాల్లో విరివిగా వైద్యశిబిరాలు ఏర్పాటుచేస్తామన్నారు. ఇందులో భాగంగా శంబర పీహెచ్‌సీను ఆయన శుక్రవారం పరిశీలించారు. మందుల నిల్వలు, రికార్డులను తనిఖీ చేశారు. శంబర గ్రామంలో వైద్యశిబిరాలు ఏర్పాటుచేసే స్థలాలను పరిశీలించారు. జాతరలో 24 గంటలూ వైద్యసేవలు భక్తులకు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులు కిరణ్‌కుమార్, రమ్యశ్రీలకు సూచించారు. 108,104 వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో పీఓ వినోద్‌కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
‘ఉపాధి’ వేతనం రూ.300 వచ్చేలా చూడాలి
● గ్రామీణాభివృద్ధిశాఖ అదనపు
కమిషనర్ శివప్రసాద్
విజయనగరం ఫోర్ట్: ఉపాధిహామీ పనుల్లో పాల్గొనే వేతనదారులకు సగటున రూ. 300 వేతనం వచ్చేలా పనులు కల్పించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అదనపు కమిషనర్ ఎం.శివప్రసాద్ తెలిపారు. స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో శుక్రవారం క్షేత్ర సహాయకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి పంచాయతీలో చేపలపెంపకం కోసం కనీసం ఒక పాండ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం ఒక పశువుల షెడ్డు ఉండాలన్నారు. జిల్లాలో వ్యవసాయ సంబంధ పనులనే అధికంగా చేపట్టాలని సూచించారు. ప్రకృతి వనరుల యాజమాన్యంపై క్షేత్ర సహాయకులు అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ జె.సునీత, డ్వామా పీడీ శారదాదేవి, ఏపీడీ మణికుమార్, ఆంజనేయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment