రక్తహీనత నివారణే ధ్యేయం
గరుగుబిల్లి: గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత నివారణే ధ్యేయంగా అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయని సీ్త్ర శిశు సంక్షేమశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (విశాఖపట్నం) చిన్మయదేవి అన్నారు. మండలంలోని ఉల్లిభద్ర అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, కేంద్రానికి సరఫరా అవుతున్న పౌష్టికాహారం సరఫరాపై ఆరా తీశారు. అక్కడి కిచెన్ గార్డెన్‌ను పరిశీలించారు. చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను బోధించాలని కార్యకర్తకు సూచించారు. ప్రతీనెల 5వ తేదీన తల్లిదండ్రులతో సమావేశాన్ని నిర్వహించి ప్రీస్కూల్ నిర్వహణపై అవగాహన కల్పించాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. పరిశీలనలో పెదగుడబ ఐసీడీఎస్ సెక్టార్ సూపర్‌వైజర్ రౌతు లక్ష్మి, అంగన్‌వాడీ సిబ్బంది మరడాన కల్పన, ఎస్.లావణ్య, తదితరులు పాల్గొన్నారు.
నిమ్మగడ్డి సాగుకు ఆర్థిక సాయం
● జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా వేయి ఎకరాల్లో సాగుకు శ్రీకారం
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం: సుగంధద్రవ్యాల తయారీలో ముడిసరుకుగా వినియోగించే నిమ్మగడ్డి సాగుకు ఔత్సాహిక రైతులను ప్రోత్సహిస్తున్నట్టు కలెక్టర్ ఎ.శ్యాప్‌ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఆసక్తి చూపే రైతులకు 50 శాతం రాయితీలు ఇస్తామని చెప్పారు. నిమ్మగడ్డి సాగుకు జిల్లాలోని నేలలు, వాతావరణం అనుకూలమని, 2025–26 సంవత్సరంలో ఎంఐడీహెచ్ పథకం కింద పైలెట్ ప్రాజెక్టుగా 1,000 ఎకరాల్లో సాగుచేసేందుకు రూ.కోటి రాయితీని ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఎకరాకు సుమారు 50 వేల మొక్కలు నాటాలని, మొక్కల కొనుగోలుకు రూ.20 వేలు ఖర్చుకాగా, అందులో గిరిజన రైతులకు 50 శాతం సబ్సిడీ అందిస్తామన్నారు. మొదటి విడతలో మొక్కల ఖర్చుపై రూ.6,000లు, రెండో విడతలో సాగు ఖర్చుపై రూ.4,000లు వెరసి రూ.10 వేలు సబ్సిడీ కింద అందజేస్తామని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఇతర కేటగిరీల రైతులకు 40 శాతం రాయితీ కింద తొలివిడతలో రూ.4,800లు, రెండవ విడతగా రూ.3,200లు వెరసి రూ.8వేలు అందజేస్తామని తెలిపారు. ఒడిశాలోని పలు గ్రామాల రైతులు నిమ్మగడ్డిని సాగుచేసి లాభాలు ఆర్జిస్తున్నారన్నారు. ఆసక్తిగల రైతులు వ్యవసాయ, ఉద్యాన సహాయకులను సంప్రదించి వివరాలు నమోదుచేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment