పీజీఆర్‌ఎస్ అర్జీలు పునఃప్రారంభం కారాదు
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిస్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అర్జీలు పునఃప్రారంభం కారాదని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పలు అంశాలపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను పరిష్కరించాలన్నారు. పీఎం జన్‌మాన్ పనులు, పీఎంఏవై 2.0 కింద నిర్మిస్తున్న గృహాలు వేగవంతం కావాలన్నారు. అనుమతులు పొంది నిర్మాణం చేయని గృహాలను తక్షణమే గ్రౌండింగ్ చేయాలన్నారు.
పీఎంజీఎస్‌వై కింద జిల్లాలో రహదారులను నిర్మించుకొనే అవకాశం ఉందని, అందుకు వివరాలను సేకరించాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ కె. హేమలత, కెఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌ఓ ఎస్.భాస్కరరావు, డీసీహెచ్‌ఓ బి.వాగ్ధేవితో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment