ఇసుక అక్రమ తవ్వకాలపై సబ్‌కలెక్టర్ సీరియస్
పాలకొండ: మండలంలోని గోపాలపురం వద్ద నాగావళి నదిలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపుపై సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డి చర్యలు చేపట్టారు. అక్రమంగా మైనింగ్ జరుగుతుందన్న సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం ర్యాంపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను చూసి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇసుక తవ్వుతున్న 2 జేసీబీలతో పాటు, ఇసుక రవాణా కోసం ఉంచిన 5 టిప్పర్లు, 12 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పాలకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై పరిశీలన చేసి కేసు నమోదు చేయాలని ఎస్‌ఐ ప్రయోగమూర్తి, డీటీ సన్యాసిరావును ఆదేశించారు.
గోపాలపురం ఇసుక
ర్యాంపులో 19 వాహనాలు సీజ్
Comments
Please login to add a commentAdd a comment