విజయనగరం పూల్‌బాగ్: ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9న ప్రజ్ఞా వికాసం పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు వెంకటేష్ తెలిపారు. పరీక్షకు సంబంధించి వాల్‌పోస్టరును ఎల్‌బీజీ భవన్‌లో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞావికాసం పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇందులో పాల్గొని అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు వరుసగా రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలు బహుమతిగా ఇవ్వనున్నట్టు తెలిపారు. పరీక్ష రాసే విద్యార్థులు ఫిబ్రవరి 1వ తేదీలోపు ఫీజు రూ.30 చెల్లించి పేర్లు నమోదు చేసుకుని హాల్‌టిక్కెట్ తీసుకోవాలన్నారు. వివరాలకు 75692 90549, 79975 32521 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment