రామాయణంలోని విలువలను తెలుసుకోవాలి
విజయనగరం రూరల్: రామాయణంలోని విలువలను నేటి తరం తెలుసుకోవాలని ప్రముఖ ఆద్మాత్మికవేత్త వేమకోటి సూర్యనారాయణ శర్మ పిలుపునిచ్చారు. మండలంలోని రామనారాయణ ప్రాంగణంలో రెండో రోజు శనివారం నిర్వహిస్తున్న యువ సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని సంభాషించారు. రామాయణంలోని ఉన్న అద్భుతమైన పలు అంశాలను నేటితరం యువతకు తెలియజేసేలా ప్రయత్నిస్తున్న నారాయణం శ్రీనువాస్ కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రామాయణంలోని పలు ఘట్టాలను నాటక రూపంలో పలువురు విద్యార్థులు ప్రదర్శన చేశారు. అనంతరం పాడుతా తీయగా గాయకులు పరమేవ్ రామాయణంలోని పలు అంశాలపై అనర్హులుగా మాట్లాడి పలువురు ప్రశంసలను అందుకున్నారు. అనంతరం కార్యక్రమంలో చివరగా వేదికపై ఉన్న ఆహుతులకు, విద్యార్థులకు జ్ఞాపికలను బహుకరించారు.
Comments
Please login to add a commentAdd a comment