శుక్రవారం శ్రీ 10 శ్రీ నవంబర్ శ్రీ 2023
● ఈటల: హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున ప్రతీ ఎన్నికల సందర్భంగా డమ్మీ నామినేషన్ వేస్తున్నారు. గతంలో ఇలా ఏడుసార్లు వేశారు. ఇప్పుడు కూడా డమ్మీ నామినేషన్ వేశారు.
న్యూస్‌రీల్
పతికి మద్దతుగా సతి డమ్మీ నామినేషన్ వేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల సతీమణులు కోరుట్లలో బీఆర్‌ఎస్ అభ్యర్థికి తండ్రి.. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 314 సెట్లు దాఖలు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: రాజకీయాల్లో నమ్మకం అనేది చాలా విలువైనది. ఏమాత్రం అవకాశం దొరికినా.. వెన్నుపోట్లు ఎదురవుతాయి. అందుకే, ప్రతీ నాయకుడు తాను వేసే అడుగుల్లో ముందు తన కుటుంబసభ్యులే నడవాలని కోరుకుంటారు. నామినేషన్ వేసే దశ నుంచే ఈ మేరకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటారు. అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించే నామినేషన్ అఫిడవిట్‌లో సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. అలాంటి సమయంలో నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలుంటాయి. ఈ క్రమంలో ముందుచూపుతోనే ఒకప్పుడు నాయకుడు తమకు నమ్మకస్తులైన అనుచరులతో డమ్మీ నామినేషన్ వేయించేవారు. రానూరాను రాజకీయాల్లో వెన్నుపోట్ల సంప్రదాయం పెరిగిపోవడంతో నేతలు తమ కుటుంబసభ్యులతోనే డమ్మీ నామినేషన్ వేయిస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత.. అంతా బాగుంది అనుకుంటే తమవారి కోసం వీరు నామినేషన్ ఉపసంహరించుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment