సమస్యలు పరిష్కరించాలి
అద్దె బస్సుల యాజమానులు చాలా సమస్యలతో పోరాడుతున్నారు. మహలక్ష్మి పథకం వచ్చిన తర్వాత బస్సులు తరుచూ రిపేర్లకు గురవుతున్నాయి. ప్రభుత్వం ఉపశమనం కోసం రూ.5 వేలు పెంచినా ఏమాత్రం సరిపోవడం లేదు. డ్రైవర్లు సైతం జీతాలను పెంచారు. డ్రైవర్ల ఇబ్బంది కూడా ఉంది. టైర్లు సంస్థ నుంచి ఇప్పించాలి. ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చేవాటిలో కట్ చేసుకొని టైర్లు ఇవ్వాలి. – పులి ప్రసాద్,
అద్దె బస్సుల సంఘం అధ్యక్షుడు
అదనపు బస్సులు నడిపిస్తాం
ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తాం. రీజియన్ పరిధిలో కొంతమేర ఓవర్‌లోడ్ సమస్య ఉంది. ఆయా రూట్‌లలో అదనపు బస్సులు నడిపిస్తాం. 70 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయి. వాటిని కూడా తిప్పుతాం. ఇప్పటికే ఎక్స్‌ప్రెస్, లగ్జరీ బస్సులను పెంచాం. మహాలక్ష్మి పథకం ప్రారంభించాక ప్రయాణికుల సంఖ్య, ఆదాయంలో హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్‌ల తర్వాత కరీంనగర్‌దే అగ్రస్థానం.
– రాజు, ఆర్‌ఎం, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment