డంపింగ్ యార్డ్‌గా ఓసీపీ–4
కోల్‌సిటీ(రామగుండం): నగరపాలక సంస్థను చాలాకాలంగా వెంటాడుతున్న డంపింగ్ యార్డు సమస్య ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ –(ఓసీపీ)4 సమీపంలో డంపింగ్‌యార్డ్ కోసం సింగరేణి సంస్థ స్థలాన్ని కేటాయించింది. ఇందులో భాగంగా శుక్రవారం ఓసీపీ–4 ప్రాంతాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగరపాలక సంస్థ ఎఫ్‌ఏసీ కమిషనర్ అరుణశ్రీ పరిశీలించారు. స్థలాన్ని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పలువురు అధికారులు ఉన్నారు.
సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ సందర్శన..
రామగుండంలోని సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను అరుణశ్రీ సందర్శించారు. పూర్తి సామర్థ్యంతో పనిచేసేందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. నీటిని శుద్ధి చేసిన తర్వాతే బయటకు విడుదల చేయాలని సూచించారు. అలాగే ప్లాంట్‌లో పనిచేసే సిబ్బందికి మరుగుదొడ్లు తదితర వసతులు కల్పించాలని ఆమె ఆదేశించారు.
హిందూ శ్మశానవాటిక పరిశీలన..
గోదావరి ఒడ్డున ఉన్న హిందూ శ్మశానవాటికను ఎఫ్‌ఏసీ కమిషనర్ అరుణశ్రీ సందర్శించారు. అంత్యక్రియల కోసం వచ్చేవారికి ఇబ్బంది కలుగకుండా వసతులు, సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇక్కడ చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అన్నారు. నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాయలింగు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, డీఈ శాంతిస్వరూప్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ మధుకర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నాగభూషణం, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
స్థలాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ అరుణశ్రీ
వినియోగంలోకి తేవాలని అధికారులకు ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment