పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
పెద్దపల్లిరూరల్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలపాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అన్నారు. టెన్త్ విద్యార్థుల కోసం రూపొందించిన కార్యాచరణ ప్రచార పోస్టర్‌ను శుక్రవారం తన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. మార్చిలో నిర్వహించే వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచిఫలితాలు సాధించేలా ప్రోత్సహించేందుకు వీలుగా వారిస్థాయి సా మర్థ్యాలను పెంచాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని చెప్పారు. కార్యాచరణ ను బట్టి సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సబ్జెక్టులను దత్తత తీసుకుని విద్యార్థులను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మాధవి, సమగ్ర శిక్షా సమన్వయకర్త పీఎం షేక్ పాల్గొన్నారు.
బాలికా విద్యకు సావిత్రీబాయి కృషి
బాలికా విద్య కోసం సావిత్రీబాయి ఫూలే ఎంతగానో కృషి చేశారని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్‌లో సావిత్రీబాయి జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రభుత్వం సావిత్రీబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా పాటించాలని నిర్ణయించిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతీ మండలం నుంచి ఓ మహిళా ఉపాధ్యాయురాలిని ఎంపిక చేసి సత్కరించుకుంటున్నామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా సావిత్రీబాయి మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలలను ప్రారంభించారని గుర్తుచేశారు. పలువురు మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్, అధికారులు సత్కరించారు. డీఈవో మాధవి, సమగ్ర శిక్షా సమన్వయకర్త పీఎం షేక్ పాల్గొన్నారు.
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ధర్మారం మండలంలోని పలువురు ఉపాధ్యాయులతో కలెక్టర్ సమావేశమయ్యారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి అందుకు అనుగుణంగా ప్రోత్సాహం అందించాలని ఆయన సూచించారు. డీఈవో మాధవి, అకడమిక్ అధికా రి పీఎం షేక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రత్యేక తరగతుల నిర్వహణకు చర్యలు
కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment