పల్లెలకు పక్కా రోడ్లు
పెద్దపల్లిరూరల్: ప్రతీ పల్లెను అనుసంధానిస్తూ ని యోజకవర్గంలోని అన్ని గ్రామాలకు పక్కా రోడ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నా రు. కాపులపల్లి – గోపయ్యపల్లి వరకు రూ.కోటి వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు పనులను శుక్రవా రం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. పల్లె ప్ర జలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామన్నా రు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా.. ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కిందన్నారు. పంచాయతీరాజ్ ఈఈ గిరీశ్‌బాబు, డీఈఈ శంకరయ్య, మార్కెట్ కమిటీ చైర్‌ప ర్సన్ ఈర్ల స్వరూప, వైస్‌చైర్మన్ మల్లారెడ్డి, నాయకులు ఎడెల్లి శంకర్, మల్లయ్య, గోపు శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి, మహేందర్ పాల్గొన్నారు.
ఆధునిక డిజైన్లలో కుట్టుశిక్షణ
మహిళలు ఆర్థికాభ్యున్నతి సాధించేందుకు స్వ యం ఉపాధి అవసరమని, కుట్టుపనిలో ఆఽధునిక డిజైన్లలో శిక్షణ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు ఆయన సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వ రూప, డాక్టర్ టి.వెంకటేశ్వర్‌రావు, నాయకులు మల్లన్న, సంపత్, సుభాష్, అమ్రేష్, మస్రత్, సజ్జద్ తదితరులు పాల్గొన్నారు.
దశలవారీగా అమలు చేస్తున్నాం
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): కాంగ్రెస్ ప్రభు త్వం మాటకు కట్టుబడి దశలవారీగా పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. నారాయణారావుపల్లి–సాంబయ్యపల్లి మధ్య రూ.కోటితో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, ఎంపీడీవో దివ్యదర్శన్ పాల్గొన్నారు. కాగా, గర్రెపల్లి మండలం ఏర్పాటుకు ప్ర తిపాదనలు పంపించేలా కృషి చేసిన ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధులు, నేతలు సన్మాంచించారు.
ఎమ్మెల్యే విజయరమణారావు
Comments
Please login to add a commentAdd a comment