గీత కార్మికుల వంటావార్పు
పాలకుర్తి(రామగుండం): రాణాపూర్ గ్రామ రెవెన్యూ శివారులో ఇటీవల ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాల స్థాపన నిమిత్తం ఈతవనాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గీత కార్మికులు ఈతవనాల ప్రాంతాల్లో శుక్రవారం వంటావార్పుతో నిరసన తెలిపారు. నవరత్న కంపెనీగా ప్రఖ్యాతిగాంచిన ఎన్టీపీసీ నిర్వాసితులపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం శోచనీయమన్నారు. గౌడకుల వృత్తిని సర్వనాశనం చేస్తుండడంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గౌడ కులస్తులకు వివిధ గ్రామాల గౌడ సంఘాల సొసైటీలు మద్దతు ప్రకటించాయి. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ గౌడ కుల వృత్తిదారుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్టీపీసీ వైఖరిని తప్పుపట్టారు. విద్యుత్ కేంద్రాలను స్థాపించే ముందు సర్వస్వం త్యాగం చేసే నిర్వాసితుల ప్రయోజనాలను కాలరాయడం సరికాదని అన్నారు. నిర్వాసిత కుటుంబాలకు ఆర్థిక, ఉపాధి ప్రయోజనాలపై హామీ ఇచ్చిన తర్వాత విద్యుత్ కేంద్రాలను స్థాపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గీత కార్మికులు చేపడుతున్న వంటావా ర్పుకు గౌడ సంఘాల ప్రతినిధులు, రైతుకూలీ సంఘం ప్రతినిధులు కోట రవిగౌడ్, ముడిమడుగుల మల్లన్న, ఎరుకల రాజన్న, బాలసాని స్వా మిగౌడ్, మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, సర్వాయిపాపన్న రాష్ట్ర అధ్యక్షుడు జాగిరి అంజన్‌కుమార్, రాణాపూర్ మాజీ సర్పంచ్ ఆడె పు శ్రీనివాస్ సంఘీభావం ప్రకటించారు.
ఎన్టీపీసీ వైఖరిపై నిరసన
Comments
Please login to add a commentAdd a comment