400కు తగ్గిన అద్దె బస్సులు
మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత అద్దె బస్సుల సంఖ్య తగ్గింది. గతంలో కరీంనగర్ రీజియన్‌లో 800కు పైగా తిరగగా.. ప్రస్తుతం 400కు తగ్గాయి. రోజువారీ రిపేర్లు వస్తుండటంతో వీటి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రభుత్వం అద్దె బస్సులకు రూ.5 వేలు పెంచినా ఏమాత్రం సరిపోవడం లేదని వాటి యాజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
షెడ్డుకే పరిమితం
రీజియన్ పరిధిలో కొన్ని బస్సులకు కాలపరిమితి ఉన్నా.. అధిక సంఖ్యలో ప్రయాణికులను తీసుకెళ్లడంతో రిపేర్లకు గురై, షెడ్డుకే పరిమితమయ్యాయి. కరీంనగర్, తదితర రూట్‌లలో నడిచే నాన్‌స్టాప్ మినీ బస్సులు తరచూ మరమ్మతుకు గురవుతున్నాయి. మరోవైపు అధికారులు స్పందించి, బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment