జాతీయ పోటీలకు ఎంపిక
ధర్మారం(ధర్మపురి): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి మడ్డి వంశీ హ్యాండ్‌బా ల్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ దురిశెట్టి అనంతరామకృష్ణ తెలిపారు. మ హబూబ్‌నగర్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్– 17 వి భాగం రాష్ట్రస్థాయి పోటీల్లో కరీంనగర్ జట్టు త రఫున పాల్గొన్న వంశీ.. ప్రతిభ కనబర్చి సిల్వర్ మెడల్ సాధించినట్లు వివరించారు. వంశీని ప్రిన్సిపాల్ అనంతరామకృష్ణ, అధ్యాపకులు శుక్రవారం సన్మానించి అభినందించారు.
చైనా మాంజాపై నిషేధం
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో చైనా మాంజాపై నిషేధం విధించినట్లు గో దావరిఖని ఏసీపీ రమేశ్ తె లిపారు. చైనా మాంజాను విక్రయించినా, ఉపయో గించినా, ఎవరికై నా ప్రమాదం జరిగినా, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు.
చంద్రకళకు పురస్కారం
జ్యోతినగర్(రామగుండం): హైదరాబాద్‌లో శుక్రవారం సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సామాజి క సేవకురాలు గోలివాడ చంద్రకళ సావిత్రీ బా యి ఫూలే రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఆమె 25 ఏళ్లుగా రామగుండం నియోజకవర్గంలో మహిళా సాధికారత, మహి ళా అభ్యుదయం కోసం కృషి చేస్తున్నారు. బీసీ మహిళా సంక్షేమ సంఘం ప్రతినిధులు చంద్రకళను ప్రత్యేకంగా అభినందించి, శాలువాతో సత్కరించి, మెమొంటో అందజేశారు.
మహిళా విద్య కోసం ఉద్యమించిన నేత
కోల్‌సిటీ(రామగుండం): మహిళా విద్య కోసం ప్రథమంగా గళమెత్తిన నేత సావిత్రీబాయి ఫూ లే అని రామగుండం నగర మేయర్ బంగి అనిల్‌కుమార్ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం సావిత్రీబాయి ఫూలే జ యంతి నిర్వహించారు. మేయర్ మాట్లాడు తూ, కుల వ్యవస్థ, పితృస్వామ్యం, అంటరాని తనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రీబాయి అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. కా ర్పొరేటర్ బాల రాజ్‌కుమార్, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, పెద్దెల్లి ప్రకాశ్, బల్దియా అసిస్టెంట్ కమిషనర్ రాయలింగు, సీనియర్ అసిస్టెంట్ పబ్బాల శ్రీనివాస్, సిబ్బంది, అంబేడ్కర్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
మద్యపానంపై నిషేధాజ్ఞలు
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం పోలీస్ కమి షనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని బ హిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై నిషేధాజ్ఞలను ఫిబ్రవరి వరకు పొడిగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్(సీపీ) శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, మందుబాబుల ఆగడాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చ ర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. అదేవిధంగా అనుమతి లేకుండా డీజే సౌండ్, డ్రోన్లు వినియోగిస్తే చర్యలు తప్పవన్నారు. చి న్నపిల్లలు, వృద్ధులు, పేషెంట్లు, విద్యార్థులకు ఇబ్బందులులు తలెత్తకుండా, శబ్ద కాలుష్యం నియంత్రణకు డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించినట్లు స్పష్టం చేశారు. వివిధ కార్యక్రమాల సందర్భంగా ప్రజల సమీకరణ, ప్రదర్శనల కోసం మైక్ సెట్‌లను మాత్రమే వి నియోగించుకోవాలని సూచించారు. డీజీ సౌండ్ తప్పనిసరైతే ఏసీపీల నుంచి అనుమతి పొందాలని పేర్కొన్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment