నీటి సంపులో పడి వృద్ధురాలి మృతి
శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని కాచాపూర్‌కు చెందిన దాసరి కనకమ్మ(75) నీటి సంపులో పడి, మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. కనకమ్మ భర్త మల్లేశం కొన్ని నెలల క్రితం చనిపోయాడు. వయసు పైబడటంతో ఇద్దరు కుమారులు వంతులవారీగా ఆమెకు తిండి పెడుతున్నారు. ఈ క్రమంలో కనకమ్మ శనివారం ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి, చనిపోయింది. కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. కేశవపట్నం ఎస్సై రవిని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో ప్రతిభ
కరీంనగర్ స్పోర్ట్స్: హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన 68వ రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–17 చెస్ పోటీల్లో కరీంనగర్ అల్ఫోర్స్ పాఠశాల విద్యార్థి సుప్రీత్ ప్రతిభ కనబరిచి, జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా శనివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అతన్ని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ గని కార్మికుడి మృతి
గోదావరిఖని: నగరంలోని మార్కండేయ కాలనీ శివాలయం వీధికి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు ఆకుల తిరుపతయ్య(65) శుక్రవారం రాత్రి హఠాత్తుగా మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బా ధపడుతున్నారు. సింగరేణిలో మైనింగ్ సర్దార్‌గా పనిచేసి ఐదేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు.. భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ఐఎన్‌టీయూసీలో క్రియాశీలకంగా పనిచేశారు. తిరుపతయ్య మృతికి ఐఎన్‌టీయూసీ నాయకులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment