గోదావరిఖని: బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలా న్ని రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ స భ్యుడు ముత్యంరావు డిమాండ్ చేశారు. స్థానిక శ్రా మికభవన్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకు కేటాయించకుంటే భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలు ఉండవన్నారు. కాగా, ఈనెల 23, 24వ తేదీల్లో ఎన్టీపీసీ ఏరియాలో జరిగే సీపీఎం మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నాయకులు ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, తోట నరహరిరావు, ఆసరి మహేశ్, రాజేశ్వరచారి, నంది నారాయణ, శివరాంరెడ్డి, దుర్గాప్రసాద్, ఈద వెంకటేశ్వర్లు, ఎస్.శ్రీనివాస్, పోలేటి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
హామీలు అమలు చేయాలి
రామగిరి(మంథని): ఎన్నికలకు ముందు ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బల్ల సత్తయ్య కోరారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు అనవేన శ్రీనివాస్ అధ్యక్షతన ఈనెల 21న నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాలు, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ ప్రచార పోస్టర్‌ను కల్వచర్ల గ్రామంలో ఆదివారం ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment