సిరిసిల్లకల్చరల్/కోనరావుపేట: నిర్లక్ష్యంగా వాహ నం నడిపి ఇద్దరి వ్యక్తుల మృతికి కారకుడైన వ్యక్తికి ఏడాదిన్నర జైలు శిక్ష పడింది. వివరాలు.. గత జనవరి 12న కోనరావుపేట మండలానికి చెందిన గడిపెల్లి మల్లేశం, తాటకర్ల శంకర్ సొంత పని నిమిత్తం సింగరవేణి కిషన్ నడుపుతున్న ట్రాక్టర్ ఎక్కారు. కిషన్ తన ట్రాక్టర్‌ను నిర్లక్ష్యంగా, అతి వేగంగా నడపడంతో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న మల్లేశం, శంకర్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డా రు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణ అధికారి మాలకొండ నాయుడు చార్జ్‌షీట్ వేయగా ప్రాసిక్యూషన్ తరఫున పీపీ సందీప్ కేసు వాదించారు. కేసు పూర్వాపరాల పరిశీలన అనంతరం మేజిస్ట్రేట్ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ కిషన్ జిల్లాకోర్టుకు అప్పీలుకు వెళ్లాడు. నిందితుడు కిషన్‌కు ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత మంగళవారం తీర్పు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment