ఎగుమతి చేసేస్థాయికి చేరితేనే రైతుకు ఆదాయం
జగిత్యాలఅగ్రికల్చర్: అమెరికా, ఇంగ్లండ్ వంటి దేశాలకు పంట ఉత్పత్తులు ఎగుమతి చేసేస్థాయికి రైతులు ఎదిగితేనే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. రైతులతో సమావేశమయ్యారు. రైతులు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడి ఆదాయం ఎలా పొందుతున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు నిర్మించుకున్న గోదాం, సాగుచేస్తున్న పసు పు, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీరైతు వ్యాపారిలా ఆలోచించి పంటలు పండిస్తేనే ఆశించిన ఆదాయం సమకూరుతుందని తెలి పారు. అధిక ఆదాయం పొందేందుకు విభిన్న పంటలు పండించడంలో లక్ష్మీపూర్ రైతులు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఇదేసమయ ంలో సంఘటితంగా ఏర్పడి తమ పంటను తామే మార్కెటింగ్ చేసుకునే స్థాయికి ఎదగాలని సూచించారు. ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విలువ జోడించి విక్రయిస్తే మంచి ఆదాయం లభిస్తుందని అన్నా రు. రైతులు రాజకీయాలను పక్కన పెడితే రైతు సహకార సంఘాలు అభివృద్ధి బాటలో పయనిస్తా యని చెప్పారు. ప్రభుత్వాలను అడుక్కునే బదులు ప్రభుత్వాలే రైతల వద్దకు వచ్చేలా బాధ్య త తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏడీఏ అశోక్‌కుమార్, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ కన్వీనర్ రాజేందర్, సహకార సంఘం అధ్య క్షుడు పన్నాల తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు గర్వందుల చిన్నగంగయ్య, డైరెక్టర్లు పాల్గొన్నారు.
సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ
Comments
Please login to add a commentAdd a comment