హోమం చేసి.. గోశాల శుద్ధి చేసి
వేములవాడ: హనుమకొండకు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు రాకేశ్‌రెడ్డి మంగళవారం వేములవాడలో హోమం నిర్వహించి, గోశాలను శుద్ధి చేసి, తాను తెచ్చిన నిజకోడెను రాజన్నకు అప్పగించారు. మంత్రి కొండా సురేఖ సిఫారసుతో అక్రమంగా కబేళాలకు తరలించిన పాపానికి పాప ప్రక్షాళన, ప్రాయశ్చిత్తం కోసం రాజన్న సన్నిధిలో శాంతిహోమం నిర్వహించి, కోడెను సమర్పించినట్లు వివరించారు. శివుడి వాహనమైన నందినే కబేళాలకు తరలించి కాంగ్రెస్ పార్టీ తన గొయ్యి తానే తీసుకుందన్నారు. మంత్రి సురేఖ కాశీకి వెళ్లినా ఆమె పాపం పోదన్నారు. రాజన్న సన్నిధిలో వరుసగా జరుగుతున్న అపచారాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోడెల అమ్మకంలో ప్రధాన పాత్రదారులందరిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి, కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వేములవాడలో కొనసాగుతున్న కోడెల రగడ
Comments
Please login to add a commentAdd a comment