బంగారానికి పూతపెడతామని నమ్మించి చోరీ
కోరుట్ల రూరల్: బంగారానికి పూత పెడతామని నమ్మించి ఇద్దరు నిందితులు మండలంలోని నాగులపేట గ్రామంలో ఓ మహిళ నుంచి రెండు తులాల బంగారం అపహరించారు. స్థానికుల కథనం ప్రకారం.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం 9గంటల ప్రాంతంలో గ్రామానికి చేరుకున్నారు. వారిని నమ్మిన నక్క జమున తన బంగారు గొలుసుకు పూత పెట్టాలని ఇచ్చింది. వాళ్లు గొలుసుకు పూతపెడుతున్నట్టు నటించి గొలుసును జేబులో వేసుకుని నకిలీ గొలుసు ఇచ్చారు. అరగంట తర్వాత పసుపులో పెట్టి తీస్తే మంచి పూత వస్తుంద ని చెప్పి వెళ్లిపోయారు. వారు చెప్పినట్టే జము న పసుపులో వేసి బయటకు తీయగా నకిలీ గొలుసు అని గుర్తించింది. ఈ విషయమై గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో సీసీ కెమెరా పుటేజీని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. సీసీ పుటేజీ వీడియోను విడుదల చేసిన పోలీసులు నిందితులను గుర్తిస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment