ఐటీ.. మనమూ పోటీ
● హైదరాబాద్, వరంగల్ తర్వాత కరీంనగర్‌కే అవకాశాలు ● గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌గా ఎదిగే నగరమంటున్న సర్వేలు ● ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియాలుగా కొత్తపల్లి, మంథని ● తక్కువ ఖర్చులో బతికేయొచ్చట ● తాజాగా నాస్కామ్ జీసీసీ ప్లేబుక్ తెలంగాణ బ్లూ ప్రింట్‌లోనూ వెల్లడి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా హవా కొనసాగుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ నగరాల తర్వాత కరీంనగర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(జీసీసీ)గా ఎదిగే దిశగా అడుగులు వేస్తోందని సర్వేలు చెబుతున్నాయి. తా జాగా నాస్కామ్ జీసీసీ ప్లేబుక్ తెలంగాణ బ్లూప్రింట్ నివేదిక సైతం ఈ విషయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగానికి కావాల్సిన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, ఐటీ టవర్, లక్ష చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్, ఐటీ సేవలు, పలు ఇంజినీరింగ్, పీజీ కాలేజీలున్న కారణంగా ఈ మేరకు పాత కరీంనగర్ జిల్లాకు గుర్తింపు దక్కింది. మంచి వేతనంతోపాటు అందుబాటులో అద్దెలు, తక్కువ ఖర్చులో బతికేయొచ్చని నివేదిక చెప్పింది.
జీసీసీ అంటే..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు అంతర్జాతీయ కంపెనీలకు ఐటీ సేవలందించే కేంద్రాలను గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు అని పిలుస్తారు. కరీంనగర్ నుంచే యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు ఐటీ సేవలు, ఉత్పత్తుల ఎగుమతి కేంద్రంగా(హైద రాబాద్, బెంగళూరు తరహాలో) అడుగులు పడుతున్నాయి.
అనుకూలతలు ఇలా..
అర్హతలు సదుపాయాలు
హాట్‌స్పాట్స్ కరీంనగర్ ఐటీ టవర్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియా
(ఐడీఏ)లుగా కొత్తపల్లి, మంథని ప్రాంతాలు అవతరించనున్నాయి.
ఐటీ కంపెనీ/జీసీసీ 50కి పైగా టెక్ సర్వీసెస్, కొన్ని స్టార్టప్ కంపెనీలు,
జీసీసీలు ఇప్పటికి లేవు.
మానవ వనరులు 15 వేల మందికి పైగా టెకీలు, ఆర్‌అండీ ప్రొఫెషనల్స్
విద్యాసంస్థలు/కాలేజీలు ఏటా 7–9 వేల మంది గ్రాడ్యుయేట్లు, 20 కాలేజీలు/యూనివర్సిటీ.
రవాణా సదుపాయాలు వరంగల్ ఎయిర్‌పోర్ట్ (70 కి.మీ. దూరం)
ఎన్‌హెచ్–563 కరీంనగర్–వరంగల్
నివాసం/రెసిడెన్స్ 5–10 మిలియన్ చదరపు అడుగులు అందుబాటులోకి రానుంది.
రూ.9 వేల–రూ.15 వేల అద్దెలో 1,000 చదరపు అడుగుల ఫ్లాట్.
స్కిల్స్ టీ–స్కిల్స్ ప్రోగ్రాం, ఫ్రీడిజిటల్ ఆన్‌లైన్ స్కిల్స్, కోడింగ్, సాఫ్ట్ స్కిల్స్,
జాబ్ రెడీనెస్.
ఇన్‌ఫ్రా పార్ట్‌నర్స్ సీబీఆర్‌ఈ, జేఎల్‌ఎల్, కరీంనగర్ ఐటీ టవర్.
టాలెంట్ పార్ట్‌నర్స్ బొంపాట్ రిక్రూటర్స్ ప్రై.లి. ఇనాయ్ టాలెంట్ 500,
ఉపాధి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్
స్టార్టప్ పార్ట్‌నర్స్ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇన్నోవేషన్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment