ఎల్లమ్మ ఆలయం వద్ద మరోమారు వివాదం
భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సమావేశమైన గ్రామస్తులు
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం వెల్లుల ఎల్ల మ్మ తల్లి ఆలయం వద్ద మరోమారు వివాదం చోటుచేసుకుంది. ఆలయాన్ని దేవాదాయశాఖలో విలీనం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారం క్రితం అధికారులను అడ్డుకున్న వీడీసీ, గ్రామస్తులు.. మంగళవారం మరోమారు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. సీఐ నిరంజన్‌రెడ్డి, ఆలయ ఈవో కాంతారెడ్డి గ్రామస్తులతో చర్చించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని, సిబ్బందిని కూడా కేటాయించారని, తమ విధులు తాము నిర్వర్తించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే 15 రోజులు సమయం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో వచ్చే సోమవారం వరకు సమయం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏళ్ల తరబడి వీడీసీ ఆధ్వర్యంలో కొనసాగే ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని ఎలాగైనా దేవాదాయశాఖ నుంచి తప్పించేందుకు ప్రభుత్వ పెద్దలను కలవాలని నిర్ణయానికొచ్చారు.
దేవాదాయశాఖ నుంచి తప్పించాలని గ్రామస్తుల డిమాండ్
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ముందుకెళ్తామని అధికారుల వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment