జ్యోతినగర్(రామగుండం): చదువుకు మించినది ఏమీ లేదని డీఈవో మాధవి అన్నారు. అప్పన్నపే ట జెడ్పీ హైస్కూల్‌లో తెలంగాణ జీవశాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన జిల్లాస్థాయి సై న్స్ టాలెంట్ టెస్ట్ విజేతలకు ఆమె ప్రశంసాపత్రా లు, జ్ఞాపికలు అందించి మాట్లాడారు. జీవశాస్త్ర ఫోరం జిల్లా అధ్యక్షుడు గూళ్ల అంజన్ కుమార్, ఎం.నరేశ్, గెజిటెడ్ హెడ్‌మాస్టర్ పురుషోత్తం పర్యవేక్షించగా.. ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొంతుల కుమార్, జిల్లా బాధ్యుడు రవీందర్ పాల్గొన్నారు.
కుష్ఠు నిర్ధారణపై అవగాహన
పెద్దపల్లిరూరల్: కుష్ఠు నిర్ధారణ, నియంత్రణ పద్ధతులపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల్లోని లెప్రసీ నోడల్ పర్సన్స్(సూపర్‌వైజర్లు), డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అవగాహన కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment