కదంతొక్కిన కాంట్రాక్ట్ కార్మికులు
కోల్‌సిటీ(రామగుండం): హక్కుల సాధన కోసం కాంట్రాక్టు కార్మికులు బుధవారం కదంతొక్కారు. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 448 మంది విధులు బహిష్కరించారు. రామగుండం బల్దియా ఎదుట టెంట్ వేసుకుని నిరసన తెలిపారు. దీంతో నగరంలోని 50 డివిజన్లలో చెత్త ఇళ్లలోనే ఉండిపో యింది. ఆ తర్వాత అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీని నాయకులు, కార్మికులు కలిసి వినతిపత్రం అందజే సి దీక్ష విరమించారు. తమ సమస్యల పరిష్కారం కోసం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిరసన తెలిపామని, వాటిని పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు మురళీధర్‌రావు, వి.కుమారస్వామి, కి షన్‌నాయక్, రాధాకృష్ణ, లింగయ్య, ఇ.రాయమల్లు, నాగమణి, సారయ్య, రూప, అంజయ్య తెలిపారు.
పీఆర్‌సీ అమలు కోసం..
పీఆర్‌సీ అమలు కోసం కాంట్రాక్టు కార్మికులు కొద్ది రోజులుగా పోరు సాగిస్తున్నారు. గత ప్రభుత్వం జీవో నంబరు 60 ద్వారా వేతనాలు చెల్లించలేదని, 11వ పీఆర్‌సీ నిర్ణయించినా.. కనీస బేసిక్ ఆధారంగా ఒక్కో కార్మికుడికి నెలకు కేటగిరీల వారీగా రూ.19వేలు, రూ.22వేలు, రూ.31,040 వేతనాలు అమలు చేయడం లేదన్నారు. కొత్త పీఆర్‌సీ ప్రకా రం ఇప్పటికైనా నెలకు కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు.
పనిముట్లపై ఎందుకీ వివక్ష?
పారిశుధ్య కార్మికులకు పనిముట్లు సమకూర్చడంలో బల్దియా అధికారులు వివక్ష, నిర్లక్ష్యం వహిస్తున్నారని నాయకులు, కార్మికులు ఆరోపిస్తున్నారు. చీపుర్లు, పారలు, ప్లాస్టిక్ తొట్టెలు, బట్టలు, చెప్పులు, సబ్బులు, కొబ్బరి నూనె, బెల్లం ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. ఆలస్యంగా అందిస్తున్న సామగ్రి కూడా నాసిరకంగా ఉంటోందన్నారు. దీనిపై ఒక్క కార్పొరేటర్, అధికారి కూడా నోరు మొదపడం లేదని వారు వాపోతున్నారు.
డిమాండ్లు ఇవే..
● కనీస వేతనం నెలకు రూ.26వేలు చెల్లించాలి. ఐదేళ్ల సర్వీస్ ఉన్నవారిని పర్మినెంట్ చేయాలి. 8 గంటల పనివిధానం అమలు చేయాలి.
● ప్రస్తుత సొసైటీని రద్దు చేసి, ఎన్నికలు నిర్వహించాలి. కొత్త సొసైటీలో కార్మికులకు స్థానం కల్పించి, నిధులపై ఆడిట్ చేయాలి.
● జీవో ప్రకారం అన్నిజోన్లలోని కార్మికులకు సామగ్రి అందజేయాలి. వాటి కొనుగోలు బాధ్యతను కార్మికులకే ఇవ్వాలి.
● పారిశుధ్య కార్మికులకు ఏడాదికి 15 రోజుల లీవులు అమలు చేయాలి.
● మహిళా కార్మికులకు మూడు నెలలుగా చీపుర్లు ఇవ్వడం లేదు. ప్రతీనెల తప్పకుండా ఇవ్వాలి.
● ఎన్నికల సమయంలో విధులు నిర్వర్తించిన కార్మికులు అందరికీ డబ్బులు చెల్లించాలి.
● చదువు, వృత్తి నైపుణ్యం గుర్తించి జవాన్లు, డ్రైవర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా పదోన్నతి కల్పించాలి.
● రాత్రి విధులు నిర్వర్తించే వారికి రవాణా సౌకర్యం కల్పించి, పనిస్థలాల్లో రెస్ట్ రూమ్‌లు అందుబాటులోకి తీసుకు రావాలి.
● కార్మికులు మరణిస్తే అంతిమ ఖర్చుల కోసం రూ.30వేలు ఇవ్వాలి. ఖర్మకాండలు పూ ర్తయ్యే వరకూ వేతనంలో కూడిన సెలవులు ఇవ్వాలి.
● మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించాలి.
● హార్టికల్చర్, హరితహారం సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి, నెలకు రూ.16,500 చొప్పున బ్యాంక్ ద్వారా వేతనం చెల్లించాలి.
● ఆదివారాలు, పండుగల సందర్భంగా సెలవులు వర్తింపజేయాలి.
● డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇవ్వాలి.
సొసైటీని రద్దు చేయాలి
మా సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ మాట్లాడినందుకు ధన్యవాదాలు. హక్కులు సాధించే వరకూ ఎమ్మెల్యే మాతోనే ఉండా లి. మా సొసైటీని రద్దు చేసి, ఎన్నికలు జరపాలి. వస్తుసామగ్రి కొనుగోలు బాధ్యత మాకే ఇవ్వాలి. – వడ్ల నాగమణి, కార్మికురాలు
చీపుర్లు మేమే కొంటున్నాం
మా జీతాలు తక్కువ. నాలుగైదు నెలలకోసారి చీపుర్లు ఇస్తామని చెప్పిన అధికారులు.. రెండు నెలలు ఇచ్చి ఇప్పుడు ఇవ్వడం లేదు. రోడ్లను ఊడ్చడానికి చీపుర్లు లేక మేమే కొనుగోలు చేస్తున్నాం. నాసిరకం రెయిన్‌కోట్, చెప్పులు, సబ్బులు ఇస్తున్నారు. – లత, కార్మికురాలు
క్రమం తప్పకుండా ఇవ్వాలి
మూడేళ్ల నుంచి కార్మికులు, డ్రైవర్లకు బట్టలు, సబ్బులు, బెల్లం, చెప్పులు ఇవ్వడంలేదు. మూలకు పడేసిన బెల్లం ఇస్తామంటున్నారు. రెయిన్‌కోట్ వేసుకొని తీసేటప్పటికే చిరిపోయింది. కార్మికులందరికీ జీతాలు పెంచకుంటే ఆందోళనలు చేస్తాం. – కిషన్ నాయక్, ట్రాక్టర్ డ్రైవర్
సమస్యలు పరిష్కరిస్తాం
కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం. నాణ్యతలేని వస్తువులను సరఫరా చేస్తే కాంట్రాక్టర్ల కు బిల్లులు నిలిపివేస్తాం. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుధ్య కార్మికులు మంచిగా పనిచేయాలి. నగరంలో శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాం. – అరుణశ్రీ, అడిషనల్ కలెక్టర్
కనీసం వేతనం రూ.26 వేలు చెల్లించాలి
హక్కుల సాధన కోసం విధుల బహిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment